ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. మేయర్ ( Mayor), చైర్పర్సన్ (Chairperson) పీఠం కోసం బరిలో నిలబడిన 520 మంది కౌన్సిలర్లు (Councilors ), కార్పొరేటర్ల (Corporators) హోదా కోసం పోటీపడిన 10,105 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు 60 లక్షల మంది ఓటర్లు ఇచ్చి తీర్పు నేడు వెలువడనుంది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో లెక్కింపు కొనసాగుతోంది. రాత్రి 8 గంటల్లోగా వీటి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు.







