తెలుగు సంఘం ఆఫ్ ఫ్లోరిడా, టాంపా బే ఆధ్వర్యలో దసరా, దీపావళి సంబరాలు, స్వరావధానం
తెలుగు సంఘం ఆఫ్ ఫ్లోరిడా, టాంపా బే ఆధ్వర్యంలో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 7 జరిగే ఈ సంబరాలకు ప్రముఖ యాంకర్ లావణ్య గూడురుతో పాటు మరో యాంకర్ రాగా బొమ్మారెడ్డి హాజరవుతున్నారు. ఈ వేడుకలు India cultural cenre tampa వేదికగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సంప్రదాయ, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, మ్యూజికల్ ఈవెంట్స్, స్వరావధానంతో పాటు పలు కార్యక్రమాలు వుంటాయి. ఎంట్రీ అందరికీ ఉచితంగానేవుంటుందని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ తో పాటు ఫ్రీ దివాళీ స్వీట్స్ కూడా ఇస్తారు.
మరో వైపు ఈ సంబరాల్లో భాగంగానే ‘‘స్వరావధానం’’ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వెంకట ప్రభాకర్ గరికిపాటి గారిచే అవధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 8 అంశాలు వుండనున్నాయి. ఇది సాయంత్రం 4:00 గంటల నుంచి 6:00 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం India cultural centre hall 5511 lynn rd, tampa FL 33624 వేదికగా జరగనుంది.
అందులో
రాగమార్పు – సుధా
రసమార్పు/ భావమార్పు – శ్రీధర్ యర్రంశెట్టి
తాళమార్పు – ప్రహ్లాద్ మాడభూషి
రాగమాలిక – అమరనాథ్ వంగర
నిషిద్ధ స్వరం – భాస్కర్ సోమంచి
స్వరాక్షరి – బాలా అమరవేదీ
అప్రస్తుత ప్రసంగం – రాధిక నోరి
ఈ కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకొచ్చి, సంబరాల్లో హాయిగా గడుపుదాం.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకుందాం.







