3rd November 2026

_________

- Bhuvana

ఆకలి వేస్తే ఇవే తినండి.. 100 కేలరీలలోపు హెల్తీ స్నాక్స్!

ఒక మధ్యస్థ ఆపిల్ సుమారు 95 కేలరీలు మాత్రమే. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది.

ఆపిల్ – సహజమైన ఫైబర్ స్నాక్

ఒక ఉడికించిన గుడ్డులో సుమారు 70–80 కేలరీలు ఉంటాయి. మంచి ప్రోటీన్ అందించి ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉడికించిన గుడ్డు

100 కేలరీలలోపు ఉండే లో-ఫ్యాట్ లేదా ఫ్యాట్-ఫ్రీ గ్రీక్ యోగర్ట్ ప్రోటీన్‌తో పాటు గట్ హెల్త్‌కు ఉపయోగపడే ప్రోబయోటిక్స్ అందిస్తుంది. 

లో-ఫ్యాట్ గ్రీక్ యోగర్ట్

నూనె లేకుండా చేసిన 3 కప్పుల ఎయిర్-పాప్ పాప్‌కార్న్ 100 కేలరీలలోపే ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండి మంచి స్నాక్‌గా పనిచేస్తుంది.

ఎయిర్-పాప్ పాప్‌కార్న్

20 గ్రాముల డ్రై రోస్టెడ్ మఖానా సుమారు 50–70 కేలరీలు మాత్రమే. తక్కువ కొవ్వుతో క్రంచీగా ఉండే మంచి స్నాక్.

వేయించిన మఖానా

ఒక గ్లాస్ మజ్జిగలో సుమారు 45–60 కేలరీలు మాత్రమే ఉంటాయి. శరీరానికి హైడ్రేషన్, జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

మజ్జిగ

అర కప్పు మొలకల చాట్‌లో సుమారు 80 కేలరీలు ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండి ఆరోగ్యకరమైన ఎంపికగా నిలుస్తుంది.

మొలకల చాట్