గ్లామర్‌లో తగ్గేదేలే.. కరీనా కపూర్ స్టన్నింగ్ ఫోటోషూట్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor) తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. వయసు పెరుగుతున్నా ఏమాత్రం తగ్గని గ్లామర్‌తో, స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా రిలీజైన ఫోటోల్లో కరీనా తన ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ఫోటోషూట్‌లో కరీనా పేస్టల్ షేడ్స్‌తో కూడిన పైస్లీ ప్రింటెడ్ షర్ట్, బ్లాక్ వైడ్ లెగ్ ట్రౌజర్స్ ధరించారు. దీనికి కాంట్రాస్ట్‌గా రెడ్ కలర్ బెల్ట్, మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్‌ను జత చేశారు. మెడలో లేయర్డ్ గోల్డ్ నెక్లెస్‌లు, చేతికి స్టైలిష్ బ్రేస్లెట్స్తో తన లుక్కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చారు కరీనా. గాలికి ఎగురుతున్న కురులతో ఇచ్చిన పోజులు ఫోటోలకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవగా, ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.







