న్యూజెర్సీలో ‘‘Bharath Rising, in the Modi Era’’ పుస్తకావిష్కరణ సభ
బీజేపీ ఏపీ మీడియా ఇంచార్జి డాక్టర్ దిలీప్ కిలారు రాసిన ‘‘Bharath Rising, in the Modi Era’’ అనే పుస్తకావిష్కరణ సభ న్యూజెర్సీలో ఘనంగా జరిగింది. న్యాయ, పరిపాలన, ప్రజా వ్యవహారాల్లో తనకున్న విశేష అనుభవాన్ని జోడించి దిలీప్ కిలారు ఈ పుస్తకాన్ని రచించారు. మన్రో టౌన్ షిప్ లోని ఫోర్స్ గేట్ కంట్రీక్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్నారైలు, వివిధ రంగాల ప్రముఖులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

ఈ పుస్తకావిష్కరణ సభకి ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ లీడర్, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎన్ఏ మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల అతిథిగా, టెక్నో కాంప్ ప్రెసిడెంట్ సంజయ్ గుండాల విశిష్ట అతిథిగా, ముఖ్య అతిథిగా రాకేష్ గంటా విచ్చేశారు. వీరు మోదీ హయాంలో భారత్ లో జరిగిన అభివృద్ధితో పాటు వివిధ రంగాలు, విదేశీ సంబంధాలు ఎలా పురోగమించాయో పేర్కొన్నారు.

ఇక.. పుస్తక రచయిత దిలీప్ కిలారు మాట్లాడుతూ 12 సంవత్సరాలలో మోదీ హయాంలో దేశం సాధించిన ప్రగతిని, ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతికత, జాతీయ భద్రత, చేపడుతున్న పథకాలు, ప్రపంచ వేదికపై భారత్ కి పెరుగుతున్న ప్రాధాన్యతను కూలంకషంగా వివరించారు. అలాగే సర్ ప్రక్రియ ప్రాధాన్యతతో పాటు విపక్షాలు, కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలు, ప్రజలను ఎలా తప్పుదోపట్టిస్తున్నారో వివరించారు. సర్ లో రాజకీయ అంశాలేమీ లేవని, అది రాజ్యాంగ ప్రక్రియ అని, ప్రజలందరూ దీనిని అర్థం చేసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
తన పుస్తకావిష్కరణకు సభకు ప్రవాస భారతీయులు, శ్రేయోభిలాషులు, మిత్రులు రావడం ఆనందంగా వుందన్నారు. ముఖ్య అతిథిగా రాకేష్ గంటాకి, ఇతర అతిథులకు, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక సందర్భంగా తీర్చిదిద్దిన వారందరికీ ధన్యవాదాలు ప్రకటించారు. ఈ పుస్తకం, ఆత్మవిశ్వాసంతో, ప్రగతిపథంలో పయనిస్తూ, ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న ‘కొత్త భారతదేశం’ యొక్క స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ప్రయత్నమని రచయిత దిలీప్ కిలారు వివరించారు.







