బిస్మార్క్లోని గవర్నర్ నివాసంలో మొదటిసారిగా దీపావళి వేడుకలు
బిస్మార్క్లోని గవర్నర్ నివాసంలో మొదటిసారిగా దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో నార్త్ డకోటాలో వున్న భారతీయ-అమెరికన్ కుటుంబాలు, సామాజికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు విచ్చేశారు. గవర్నర్ కెల్లీ ఆర్మ్‌స్ట్రాంగ్, ప్రథమ మహిళ కెర్స్టీ ఆర్మ్‌స్ట్రాంగ్ మరియు వ్యవసాయ కమిషనర్ డగ్ గోహ్రింగ్ దీపాలను వెలిగించారు.
ఈ దీపావళి వేడుకల సందర్భంగా ప్రథమ మహిళ కెర్స్టి ఆర్మ్‌స్ట్రాంగ్ సాంప్రదాయ భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి హాజరయ్యారు. నార్త్ డకోటాకు భారతీయ-అమెరికన్లు చేసిన కీలకమైన సేవలను గవర్నర్ ఆర్మ్‌స్ట్రాంగ్ కొనియాడారు. ప్రత్యేకంగా ప్రాణాలను కాపాడుతున్న వైద్యులను మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తున్న స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రశంసించారు.
దీపావళి వేడుకల చిత్రాలను పంచుకుంటూ, సియాటిల్‌లోని భారత కాన్సులేట్ జనరల్, ప్రథమ మహిళ అందించిన ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమం భారతీయ-అమెరికన్ సమాజానికి ఒక ప్రత్యేక ఘట్టమని, అలాగే భారత్ మరియు నార్త్ డకోటా మధ్య పెరుగుతున్న స్నేహానికి నిదర్శనమని పేర్కొంది.







