బిగ్‌బాస్‌కు గట్టి పోటీనిస్తున్న ది ట్రైటర్స్
తెలుగు బుల్లితెర, ఓటీటీ రియాలిటీ షోల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఇప్పటివరకు ఆడియన్స్ కు సుపరిచితమైన బిగ్‌బాస్(Bigg boss) ఫార్మాట్‌తో అలరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కు, సరికొత్త గేమ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ది ట్రైటర్స్(The traitors) తెలుగు గట్టి పోటీ ఇస్తోంది. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకు తేజ సజ్జ(teja sajja) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 20 మంది సెలబ్రిటీలు పాల్గొంటున్న ఈ గేమ్‌లో నమ్మకం, అనుమానం, వ్యూహాలే ప్రధాన ఆయుధాలుగా మారాయి. అమాయకులు తమ మధ్య దాగి ఉన్న ద్రోహులను గుర్తించాల్సి ఉంటుంది. చివరికి విన్నర్ గా నిలిచిన వారికి కోటి రూపాయల వరకు ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే తొమ్మిది ఎపిసోడ్లు అందుబాటులోకి రాగా, ప్రతి ఎపిసోడ్‌లోనూ కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అషికా(aashika)పై అనుమానాలు పెరిగిన టైమ్ లో విద్యు(Vidhyu) వేసిన ఎత్తుగడ, విష్ణు ఏకగ్రీవంగా ఎలిమినేట్ కావడం, రహత్(Rahat) ఆట నుంచి నిష్క్రమించడం వంటి పరిణామాలు గేమ్‌ను ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. ముఖ్యంగా రహత్‌ను శ్రావ్య పదేపదే ప్రశ్నించడం అతడి అసలు స్వరూపాన్ని బయటపెట్టడంలో కీలకంగా మారింది. ద్రోహుల ఆట ముగిసిందని భావిస్తున్న టైమ్ లో మరోసారి కొత్త ట్రైటర్స్ రంగంలోకి దిగడంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
ఇవి కూడా చదవండి
బిగ్‌బాస్‌లో గొడవలు, బహిరంగ విభేదాలు ఆడియన్స్ కు ప్రధాన ఆకర్షణగా ఉంటే, ది ట్రైటర్స్ లో ఎవరు ఎవరిని నమ్ముతున్నారు? ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? అనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. కంటెస్టెంట్లతోపాటు ఆడియన్స్ కూడా ట్రైటర్స్‌ను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భిన్నమైన గేమ్ విధానం, అనూహ్య మలుపులు షోకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి. దీంతో తెలుగు రియాలిటీ షోల్లో ది ట్రైటర్స్ తనదైన ముద్ర వేస్తూ బిగ్‌బాస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.







