పులివెందుల మున్సిపాలిటీలో కూటమి ఘన విజయం
కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ (Pulivendula Municipality)లో కూటమి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం చైర్పర్సన్ అభ్యర్థి గీతాకుమారి (Geethakumari) 13,875 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 20 వార్డులకు పోలింగ్ జరగ్గా, 17 వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలపొందారు. ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 37 వార్డుల్లో కూటమి అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. జగన్ (Jagan) సొంత నియోజకవర్గం లో కేవలం మూడు వార్డులతోనే వైసీపీ సరిపెట్టుకుంది. పులివెందులతో పాటు కడప జిల్లా (Kadapa District) వ్యాప్తంగా టీడీపీ సత్తా చాటింది. జద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, యర్రగుంట్ల మున్సిపాలిటీల్లో కూటమి విజయబావుటా ఎగురవేసింది.







