AAA VIRGINIA నూతన కార్యవర్గం ప్రకటన.. ప్రెసిడెంట్ గా దీప్తి వేంకటప్రగడ
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వర్జీనియా (AAA VIRGINIA) తన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. ప్రెసిడెంట్ గా దీప్తి వేంకటప్రగడ ఎన్నికయ్యారు. సెక్రెటరీ, ట్రెజరర్ గా కృష్ణ పొడగట్లపల్లి, ఉమెన్ ఛారిటీ సర్వీసెస్ ఛైర్ గా పావని, కల్చరల్ చైర్ గా గీత మాధురి, మెంబర్ షిప్ చైర్ గా గోపాల్ గుంటూర్ ఎన్నికయ్యారు.
AAA ఫౌండర్ హరి మోటుపల్లి, ఎంపైర్ రీజియన్ డైరెక్టర్ – హనుమంతు సింహబలుడు (సింహా) AAA ఎన్నికల పర్యవేక్షణ ప్యానెల్‌కు, కొత్తగా ఎన్నికైన టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సభ్యుల పదవీ కాలం జనవరి 1 2027 నుంచి డిసెంబర్ 31, 2030 వరకు వుంటుంది.







