తెలంగాణలో గ్రాడ్యుయేట్లకు ఊరట.. ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పెంపు
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు (MLC vote) నమోదుకు దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆన్లైన్ (Online) లో దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవడంతోఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నామినేషన్ల (Nominations) చివరి రోజు వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితా వెలువరిస్తామని, ఆ రోజు నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు.







