షారూక్ ఖాన్ ‘కింగ్’కు రికార్డ్ బ్రేకింగ్ స్టార్ట్.. 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్
– అన్నీ ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె రొమాంటిక్ సాంగ్ ‘తూ మిల్ జాయే’
షారుఖ్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కింగ్’ నుంచి తొలి పాట ‘తూ మిల్ జాయే’ నవంబర్ 2న విడుదలైన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ 61వ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేశారు. విడుదలైన 24 గంటల్లోనే ఈ రొమాంటిక్ సాంగ్ అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కలిపి ఏకంగా 6 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. ఒక్క యూట్యూబ్‌లోనే 3.63 కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. దీంతో ‘తూ మిల్ జాయే’ సాంగ్ సరికొత్త రికార్డు సృష్టించింది.
యూట్యూబ్‌లో వచ్చిన వ్యూస్‌తోనే ‘తూ మిల్ జాయే’ పాట ఇండియన్ సినిమా పాటల్లో ఆల్‌టైమ్ 24 గంటల వ్యూస్ రికార్డుల్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు షారుఖ్ ఖాన్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘జవాన్’లోని ‘జిందా బందా’ పాట పేరిట ఉండేది. ఈ పాట 24 గంటల్లో 3.46 కోట్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ‘తూ మిల్ జాయే’ ఆ రికార్డును అధిగమించింది. అంతేకాదు.. ‘గుజ్జు పటాకా’ (3.40 కోట్లు), ‘జై శ్రీరామ్’ (3.22 కోట్లు), ‘రామ్ సియా రామ్’ (3.21 కోట్లు) పాటలను కూడా వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమా పాట విడుదలైన తొలి రోజే సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె వంటి క్రేజీ ఆన్‌స్క్రీన్ జోడీ మరోసారి ‘తూ మిల్ జాయే’ పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరిజిత్ సింగ్, మధుబంతి బాగ్చి ఈ పాటను ఆలపించారు. సచిన్-జిగర్ సంగీతం అందించగా.. కుమార్ సాహిత్యం రాశారు. అంతర్జాతీయ పాప్ సింగర్ ఎడ్ షీరన్ కూడా ఈ పాటలో భాగం కావటం విశేషం. ‘కింగ్’ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఈ పాటను రూపొందించారు. రొమాన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 24న విడుదల కానున్న ‘కింగ్’ సినిమాపై ఈ పాట మరింత అంచనాలను పెంచుతోంది. మొత్తానికి సినిమా విడుదలకు ముందే ‘తూ మిల్ జాయే’ పాట భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.







