చర్మ రక్షణలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే ముఖంపై మొటిమలు, మచ్చలు రావడానికి కారణమవుతాయి. ముఖానికి అసలు చేయకూడని ఆ 7 తప్పులు ఇవే!
చేతులతో ముఖాన్ని పదే పదే తాకడం వల్ల చేతిపై ఉన్న బ్యాక్టీరియా, మురికి ముఖ చర్మానికి చేరి రంధ్రాలను మూసివేసి మొటిమలకు దారితీస్తుంది.
తరచుగా ముఖాన్ని తాకడం
మొటిమను గిల్లడం వల్ల దానిలోని ఇన్ఫెక్షన్ చర్మం అంతటా వ్యాపిస్తుంది. అంతేకాకుండా అది మానని మచ్చగా మారి ముఖం అందాన్ని పాడుచేస్తుంది.
మొటిమలను గిల్లడం లేదా పిండడం
రాత్రి పూట మేకప్ తొలగించకుండా పడుకుంటే చర్మ రంధ్రాలు పూడుకుపోయి విపరీతంగా మొటిమలు వస్తాయి. నిద్రపోయే ముందు ఫేస్‌వాష్ తప్పనిసరి.
మేకప్‌తోనే పడుకోవడం
రోజుకు రెండు సార్ల కంటే ఎక్కువసార్లు ముఖాన్ని కడగడం వల్ల చర్మంలోని సహజ నూనెలు పోయి, చర్మం మరింత ఎక్కువ నూనెను ఉత్పత్తి చేసి మొటిమలు తెస్తుంది.
అతిగా ముఖాన్ని కడగడం
ఆయిలీ స్కిన్ ఉన్నవారు నూనె శాతం ఎక్కువగా ఉన్న క్రీములు వాడితే రంధ్రాలు మూసుకుపోతాయి. ఎల్లప్పుడూ మీ చర్మతత్వానికి తగ్గ ప్రొడక్ట్స్‌నే ఎంచుకోండి.
మీ చర్మానికి తగని క్రీములు వాడటం
రోజూ వాడే దిండు గొర్రెలపై ఉన్న మురికి, నూనె ముఖానికి అంటుకుని మొటిమలు వస్తాయి. వారానికి ఒకసారైనా పిల్లో కవర్లను ఉతకడం చాలా ముఖ్యం.
మురికి పిల్లో కవర్స్ వాడటం
ఎక్స్పైరీ అయిన మేకప్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల చర్మంపై అలర్జీలు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చి మొటిమల సమస్య రెట్టింపు అవుతుంది.
గడువు ముగిసిన మేకప్ వాడటం
రోజుకు తగినన్ని నీళ్లు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి మొటిమల సమస్య తగ్గుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ 7 తప్పులను నివారించి, మీ చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొటిమలు లేని కాంతివంతమైన, అందమైన చర్మాన్ని సొంతం చేసుకోండి!