పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ హవా
ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. వీటీల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అన్నమయ్య జిల్లా (Annamayya District) గాలివీడు జడ్పీటీసీ స్థానంలో 142 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా, టీడీపీ (TDP) అభ్యర్థికి 122 ఓట్లు పోలయ్యాయి. అన్నమయ్య జిల్లా కలిగిరి మండలంలో టీడీపీ అభ్యర్థి షర్మిల (Sharmila)కు 153 ఓట్లు నమోదు కాగా, వైసీపీ (YSRCP)కి 24 ఓట్లు వచ్చాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీకి 84, వైసీపీకి 32 ఓట్లు పోలయ్యాయి.







