సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్–2026 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి : ప్రపంచ భాగస్వామ్యాలకు వేదికగా విశాఖ సదస్సు
నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖలో సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్
‘నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్ , టెక్నాలజీ, ట్రస్ట్’ థీమ్‌తో 31వ సిఐఐ సమ్మిట్
59 దేశాల ప్రాతినిధ్యం…. 15 మంది విదేశీ మంత్రుల భాగస్వామ్యం
వాణిజ్యం నుంచి క్వాంటం వరకు.. ఆరు ప్రధాన రంగాలపై చర్చలు
• సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్–2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
• సమ్మిట్‌లో చర్చించే అంశాలు, డిక్లరేషన్లపై సిఐఐ ప్రతినిధులు, అధికారులతో సీఎం రివ్యూ
• విశాఖ సమ్మిట్ రాష్ట్రంలో అనేక రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విశ్వవ్యాప్తం చేయాలి: సీఎం చంద్రబాబు

• విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, అంకుర సంస్థలను అనుసంధానిస్తూ… చర్చలను వ్యాపార, సాంకేతిక భాగస్వామ్యాల దిశగా తీసుకువెళ్లాలి
• ప్రపంచ మార్కెట్లతో రాష్ట్ర పరిశ్రమలను అనుసంధానించడం, ఎంఎస్ఎంఈలకు కొత్త వ్యాపార పరిచయాలు కల్పించడం ప్రధాన లక్ష్యం కావాలి
• సాంకేతిక సహకారాన్ని విస్తరించడం, యువత నైపుణ్యాలకు అంతర్జాతీయ అవకాశాలను పరిచయం చేయడం వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం పెంచేలా సదస్సు
• ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక రాయితీల చెల్లింపు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విధానాలు ప్రపంచ వ్యాప్తం కావాలి.
• రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, సెమికండక్టర్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేయాలి
• అత్యుత్తమ పాలసీలు, సమర్థులైన నిపుణులు, మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్, బలమైన నాయకత్వం వంటి అనుకూలతలు ఉన్న రాష్ట్రం ఏపీ
• ఏపీలో పెట్టుబడి సురక్షితం, సులభతరం అనే విషయం పారిశ్రామిక వేత్తలకు తెలియాలి.
• సమీక్షకు హాజరైన ప్రభుత్వ అధికారులు, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, ఇతర సిఐఐ ప్రతినిధులు
• ప్రపంచ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, అంతర్జాతీయ సంస్థల ప్రముఖులు, సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురానున్న విశాఖ సదస్సు
• హాజరుకానున్న 40 మందికి పైగా అంతర్జాతీయ వక్తల భాగస్వామ్యం… 350 మంది విదేశీ ప్రతినిధులు, 900 మంది భారతీయ ప్రతినిధులు
• మొత్తంగా సుమారు 1,250 మంది దేశ, విదేశీ ప్రతినిధుల భాగస్వామ్యంతో సదస్సు
• వ్యాపార సంస్థల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించేందుకు 400 బిజినెస్ టు బిజినెస్ (బీ టు బీ) సమావేశాలు
• ప్రభుత్వాలతో పరిశ్రమల సంప్రదింపులకు బిజినెస్ టు గవర్నమెంట్ (బీ టు జీ) సమావేశాలు
• సింగపూర్ నేపాల్, కంబోడియా, మయన్మార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, స్లోవాక్ రిపబ్లిక్, మారిషస్, మొజాంబిక్, ఈజిప్ట్, అల్జీరియా, టాంజానియా, గ్వాటెమాలా వంటి పలు దేశాల నుంచి హాజరు కానున్న ప్రభుత్వ ప్రతినిధులు

• రెండు రోజుల సదస్సుకు హాజరుకానున్న వివిధ దేశాల రాయబారులు, ప్రపంచ ఆహార కార్యక్రమం, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి చెందిన ప్రతినిధులు
• రెండు రోజుల సదస్సులో 6 అంశాలపై ప్రధాన చర్చలు
• సదస్సులో వాణిజ్యం – పెట్టుబడులు – గ్లోబల్ వాల్యూ చైన్స్
• ట్రస్ట్–జియో ఎకనమిక్స్– గ్లోబల్ కో ఆపరేషన్
• వ్యవసాయం–ఆహార భద్రత–జీవ ఆధారిత ఆర్థిక వ్యవస్థ
• ప్రతిభ–నైపుణ్యాలు–అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు
• సాంకేతికత–ఆవిష్కరణలు–భవిష్యత్ పరిశ్రమలు
• స్వచ్ఛ ఇంధనం–సుస్థిర వృద్ధి… అనే ఆరు ప్రధాన అంశాలపై చర్చలు







