త్వరలో పెళ్లిపీటలెక్కనున్న తేజ సజ్జా.. నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. తన నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( Revanth Reddy)ని ఆహ్వానించారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన తేజ సజ్జా, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.తేజ సజ్జా వివాహం డిసెంబరులో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ (Udaipur)లో జరగనుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకంటే ముందు నవంబరులో నిశ్చితార్థ వేడుక జరగనుంది. వివాహం అనంతరం హైదరాబాద్ (Hyderabad)లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.







