కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా లాస్ ఏంజెల్స్ ఆధ్వర్యంలో BRICS Sustainable Lifestyle Week
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం అనేది ఓ సవాల్ గా మారుతోంది. దానిని ఎదుర్కోవడానికి ఎవరికి తోచిన పద్ధతుల్లో వారు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ఇందులో భాగంగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా లాస్ ఏంజెల్స్ కొన్ని ఇతర సంస్థల భాగస్వామ్యంతో ‘‘బ్రిక్స్ సస్టైనబుల్ లైఫ్‌స్టైల్ వీక్’’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ‘‘పర్యావరణ పరిరక్షణకు ఏడు అడుగులు’’ అన్న థీమ్ తో ఈ కార్యక్రమం నడుస్తుంది.
రాబోయే తరాలకు పర్యావరణాన్ని పరిరక్షించి, వారికి మంచి పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలన్న లక్ష్యంతో ‘బ్రిక్స్ సస్టైనబుల్ లైఫ్‌స్టైల్ వీక్’ (BRICS Sustainable Lifestyle Week) అధికారికంగా ప్రారంభమైంది.One Week, Seven Actions, One Planet అన్న నినాదంతో కొనసాగుతోంది.
ఈ కార్యక్రమం నవంబర్ 1 నుంచి 7 వ తేదీ వరకూ నిర్వహిస్తారు. పాటించాల్సిన 7 కీలక చర్యలు:
మన దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పుల ద్వారా పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చో సూచిస్తున్నారు.
శక్తిని ఆదా చేయండి (Save Energy): విద్యుత్ వినియోగాన్ని తగ్గించి శక్తిని పొదుపు చేయాలి.
నీటిని ఆదా చేయండి (Save Water): వృథాగా నీటిని కారకుండా చూస్తూ ప్రతి చుక్కను సంరక్షించాలి. వ్యర్థాలను తగ్గించండి (Reduce Waste): తడి మరియు పొడి చెత్తను వేరు చేస్తూ
వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించాలి. ఇ-వ్యర్థాలను తగ్గించండి (Reduce E-Waste): ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకంలో జాగ్రత్త వహిస్తూ ఇ-వ్యర్థాలను నియంత్రించాలి.
సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పండి (Say No to Single-Use Plastic): ప్లాస్టిక్ వస్తువుల బదులు ప్రత్యామ్నాయాలను వాడాలి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి (Adopt Healthy Lifestyle): చిన్న దూరాలకు సైక్లింగ్ వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
స్థిరమైన ఆహార వ్యవస్థను పాటించండి (Adopt Sustainable Food System): ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన ఆహారపు అలవాట్లను అనుసరించాలి.
ప్రజలందరూ సుస్థిర జీవ శైలిని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకొని, భూమిని కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.







