‘ఆంధ్ర విశ్వకళా పరిషత్’ శతవార్షికోత్సవాల సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్త నిర్వహణలో రెండవ అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు
ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతవార్షికోత్సవాల సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగు శాఖ, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ స్థాయిలో “రెండవ అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు” డిశంబర్ 1-2, 2026 (మంగళ, బుధ వారాలు) తేదీలలో ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా. అంబేద్కర్ ఆడిటోరియం, విశాఖపట్నంలో జరుగనుంది. గత వంద సంవత్సరాలుగా తెలుగు భాషా, సాహిత్యాలకు అనితరసాధ్యమైన సేవలు అందిస్తున్న ఆంధ్ర విశ్వ విద్యాలయం, గత మూడున్నర దశాబ్దాలుగా ఐదు ఖండాలలో, 9 దేశాలలో ప్రపంచ స్థాయి సాహితీ సదస్సుల నిర్వహణానుభవం కలిగిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన సాహితీ సదస్సుకు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలనుండే కాక దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల తెలుగు పండితులు, కవులు రచయితలు, విశ్లేషకులు, సాహితీవేత్తలూ మొదలైన తెలుగు భాషాభిమానులు అందరూ ఆహ్వానితులే.
తమదే అయిన ఈ ప్రత్యేక వేదికలో, సహ తెలుగు భాషా, సాహిత్యాభిలాషులని కలుసుకోవడం, తమ అభిప్రాయాలను పంచుకోవడం, తెలుగు భాషా, సాహిత్యాలపై తమ మక్కువ చాటుకోవడం ఈ సాహితీ సదస్సు ముఖ్యోద్దేశ్యం. ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో సాహిత్యపరమైన అంశాలపై ప్రసంగించదల్చుకున్న వక్తలు, స్వీయ కవితా పఠనంలో పాల్గొనదల్చుకున్నవారి నుండి పత్రసమర్పణ ప్రతిపాదనలు/ కవితలు ఆహ్వానిస్తున్నాము. విదేశాలలో నివసిస్తున్న డయాస్పోరా రచయితల ప్రతిపాదనలు కూడా స్వాగతిస్తున్నాము.
పత్ర సమర్పణ ప్రతిపాదనలు, స్వీయ కవితా పఠనం, ప్రతినిధులు నమోదు చేసుకోవలసిన గూగుల్ పత్రం లంకె
https://forms.gle/7o94vfEGkoDE3nfm9
ప్రతిపాదనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: నవంబర్ 20, 2026
మరిన్ని వివరాలు, సూచనలు, నిబంధలకి జత పరిచిన పూర్తి ప్రకటన చూడండి. సముచితంగా స్పందించండి.
సదస్సు కార్యనిర్వాహక వర్గం
గౌ. ఉప కులపతి డా. జి.పి రాజశేఖర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం (సదస్సు అధ్యక్షులు), డా. వంగూరి చిట్టెన్ రాజు (వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా)
ఆచార్య జె. అప్పారావు, శాయి రాచకొండ, రాధిక మంగిపూడి, జె.పి.శర్మ, లక్ష్మి రామ్ ప్రసాద్
AU-రెండవ-అఖిల-భారత-తెలుగు-సాహితీ-సదస్సు-మొదటి-ప్రకటన







