ట్రెడిషనల్ లుక్ కు మోడ్రన్ టచ్ ఇచ్చిన త్రిష
సౌత్ బ్యూటీ త్రిష(Trisha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పొన్నియన్ సెల్వన్(Ponniyan selvan) తో కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన త్రిష, పలు సినిమాలతో బిజీగా ఉంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా పింక్ కలర్ డిజైనర్ శారీలో త్రిష ఎంతో అందంగా మెరిసిపోయింది. మెరిసే ఎంబ్రాయిడరీ వర్క్, ఫెదర్ డీటైలింగ్‌తో కూడిన బ్లౌజ్ ఆమె లుక్కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మెడలో మెరిసే స్టైలిష్ చోకర్ నెక్లెస్, సింపుల్ ఇయర్ రింగ్స్‌తో సంప్రదాయ అందానికి మోడ్రన్ టచ్ ఇచ్చారు. సాఫ్ట్ మేకప్, అందమైన హెయిర్ స్టైల్‌తో త్రిష మరింత ఎట్రాక్టివ్ గా కనిపించగా, ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాయి.







