“కిల్లర్” మూవీ కోటి రూపాయల కాంటెస్ట్ లో ఎవరూ విన్ కాలేదు, దగ్గరగా ఆన్సర్ చెప్పిన 10 మందికి లక్ష రూపాయల చొప్పున బహుమతి ఇస్తున్నాం – యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్
ఇటీవలే థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకులు థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది “కిల్లర్” మూవీ. ఈ సినిమాకు చేసిన కోటి రూపాయల కాంటెస్ట్ ప్రమోషన్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. సినిమా రిలీజై సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ కోటి రూపాయల కాంటెస్ట్ గురించి వివరాలు తెలిపారు యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్. హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ – మా సినిమాకు ఆడియెన్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. క్రిటిక్స్ నుంచి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. కొందరు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని కూడా తీసుకున్నాం. ఓవరాల్ గా మా మూవీకి రెస్పాన్స్, బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని చేయబోతున్నాం. అన్నారు.
యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ – “కిల్లర్” సినిమాకు మేము చేసిన ప్రమోషన్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అయినా అనుకోని కారణాల వల్ల మేము ఆశించినంత థియేట్రికల్ రెస్పాన్స్ రాలేదు. 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఓటీటీ, ఇతర బిజినెస్ కలిపి 8 కోట్ల రూపాయల దాకా రిటర్న్స్ వచ్చాయి. మా పెట్టుబడి 5 కోట్లకు 8 కోట్ల రూపాయలు రావడం వల్ల బిజినెస్ పరంగా లాభాల్లోనే ఉన్నాం. కోటి రూపాయల కాంటెస్ట్ గురించి ఆ వివరాలు చెప్పాలనుకుంటున్నాం. మేము సినిమా ఇంటర్వెల్ అయిన 5 నిమిషాలకు సెకండాఫ్ ట్విస్ట్ ఒక్క లైన్ లో పంపాలని చెప్పాం. కానీ మా సినిమాకు కొన్ని చోట్ల రాత్రి 10, 10.30, 10.45 గంటలకు ప్రీమియర్స్ పడ్డాయి. అందుకే ఇచ్చిన 5 నిమిషాలు టైమ్ ను 30 నిమిషాలకు పెంచాం. అందులో తమ సమాధానాలతో మాకు 5 వేల మంది స్క్రీన్ షాట్స్ పంపారు. వాటిలో మేము అనుకున్న ఆన్సర్ ఎవరూ చెప్పలేకపోయారు. అయినా దగ్గర దగ్గరగా ఆన్సర్ పంపిన 10 మందిని సెలెక్ట్ చేశాం. వారు నాగేంద్ర (హైదరాబాద్) కేశవశర్మ (వైజాగ్), మురళి (హైదరాబాద్), సాగర్ (వైజాగ్), గోపి (హైదరాబాద్), హరి (వైజాగ్), కళ (వైజాగ్), ధృవ్ (హైదరాబాద్), వెంకట్ నాయుడు (హైదరాబాద్), భాను (హైదరాబాద్). వీరి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున 10 లక్షల బహుమతి ఇవ్వబోతున్నాం. ఈ విజేతలతో కలిసి లంచ్ చేస్తాం. త్వరలో కిల్లర్ 2 సినిమా కూడా ఉంటుంది. అన్నారు.







