పచ్చని అందంలో సోనమ్ సంప్రదాయ సోయగం
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్(Sonam Kapoor) మరోసారి తన స్పెషల్ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రీన్ కలర్ ఫ్లోరల్ శారీలో సంప్రదాయ అందాలను ప్రతిబింబిస్తూ ఎంతో క్లాసీగా కనిపిస్తోంది. దానికి మ్యాచింగ్ గా ధరించిన వెల్వెట్ బ్లౌజ్, గోల్డెన్ ఎంబ్రాయిడరీ బోర్డర్ ఆమె లుక్కు మరింత రాయల్ టచ్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా పచ్చని రాళ్లతో రూపొందించిన భారీ ఆభరణాలు ఆమె అందాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సింపుల్ మేకప్, చిన్న బొట్టు, చక్కగా సర్దిన హెయిర్ స్టైల్‌తో సోనమ్ తన లుక్‌ను ఎంతో హుందాగా తీర్చిదిద్దుకుంది.
ఇవి కూడా చదవండి
మోడ్రన్ ఫ్యాషన్‌ను సంప్రదాయ వస్త్రధారణతో కలిపి చూపించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఈ ఫోటోల్లోనూ అదే స్టైల్‌ను కొనసాగించింది. కెమెరా వైపు కాకుండా దూరంగా చూస్తూ ఇచ్చిన పోజులు ఫోటోలకు మరింత క్లాసీ లుక్‌ను అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌తో ఆకట్టుకునే సోనమ్ కపూర్, ఈసారి సంప్రదాయ చీరకట్టులో తనదైన రాయల్ ఎలిగెన్స్‌ను ప్రదర్శించింది. గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మెరిసిపోతూ ఫ్యాషన్ ప్రియులను మరోసారి ఫిదా చేస్తోంది.







