నితిన్ రీబిగినింగ్లో నాని.. క్రేజీ కామెంట్స్!
నితిన్(nithin) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అలియాస్ రుక్మిణి(Alias rukmini) రిలీజ్ కు రెడీ అవుతోంది. నాని(nani) నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వరుస సినిమాల పోటీ మధ్య బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న ఈ మూవీని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు మూవీ టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరోవైపు నాని తన బ్రాండ్ ఇమేజ్‌తో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌ను కూడా పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి
తాజాగా నిర్వహించిన ఓ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో నాని, నితిన్ కలిసి స్టేజ్‌పై సందడి చేశారు. ఇద్దరూ బ్లాక్ కలర్ డ్రెస్ లో కనిపిస్తూ సాంగ్ కు అనుగుణంగా స్టెప్పులేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్లీ బాండింగ్ ఈ వీడియోలో క్లియర్ గా కనిపించడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా నాని చేసిన కామెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
గతంలో నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తుచేసుకున్న నాని.. తన కెరీర్ స్టార్టింగ్ లో ఒక చాప్టర్ నితిన్‌తో ముడిపడి ఉందని, ఇప్పుడు నితిన్ కెరీర్లో కొత్త ఆరంభానికి సంబంధించిన ఓ చాప్టర్ తనతో కలిసి ఉండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పాయి. మురళీకాంత్ దేవసోత్(muralikanth devasoth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్, ఆఫియా సయ్యద్(Aafia syed) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్(Unanimous productions) బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది.







