చీరకట్టులో మాయ చేస్తున్న సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ, అద్భుతమైన యాక్టింగ్ తో ఆడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాయిపల్లవి(Sai Pallavi) మరోసారి తన సంప్రదాయ లుక్‌తో ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా ఓం(M) ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఐవరీ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్న బ్యూటిఫుల్ శారీలో సాయి పల్లవి మెరిసిపోతూ కనిపించింది. శారీకి మెరూన్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ను జత చేసి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సంప్రదాయ ఆభరణాలు, చిన్న బొట్టు, చక్కనైన హెయిర్ స్టైల్ ఆమె లుక్కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా బ్లౌజ్‌పై చేసిన జరీ వర్క్, చీర అంచుల్లోని బంగారు రంగు డిజైన్లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోల్లో చిరునవ్వుతో కూడిన ఆమె సింప్లిసిటీ ఈ ఫొటోలకు మరింత అందాన్ని తీసుకురాగా, ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాయి.







