పోలీసుల అదుపులో ఎంపీ అవినాష్ రెడ్డి
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు(Ankalamma Guduru)లో అవినాష్ కాన్వాయ్ పై కొందరు దాడి చేశారు. దీనిపై పులివెందుల అర్బన్ పీఎస్ (Pulivendula Urban PS) లో ఆయన ఫిర్యాదు చేశారు. ఎంపీని ముందస్తుగా పోలీసులు (Police) అందుపులోకి తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు.







