ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి (indiramma beema scheme) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సిద్దిపేటలో శ్రీకారం చుట్టారు. పేద కుటుంబాల వారికి రూ.5 లక్షల జీవితబీమా కల్పించడం ఈ పథకం ప్రధానోద్దేశం. అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా దీనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 19 నుంచి డిసెంబర్ 18 వరకు నెల రోజల పాటు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు, ఆన్లైన్ (Online) లేదా ఇంటికి సర్వే ద్వారా వివరాలు నమోదు చేస్తారు. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. పూర్తి ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది.







