రాజగోపాల్ రెడ్డి విషయం పరిశీలిస్తున్నాం :మహేశ్ కుమార్
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) పేరుతో కేటీఆర్ (KTR) కొత్త డ్రామాకు తెరలేపారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు. కృష్ణా నీటిని ఏపీకి అప్పగించిందే కేసీఆర్ అని ఆరోపించారు. తెలంగాణ వాటా నుంచి ఒక్క నీటి చుక్కను కూడా తాము పోనివ్వమన్నారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy), అనిరుధ్ ( Anirudh) వ్యాఖ్యలను గమనిస్తున్నాం. క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. కొత్త ఇన్చార్జి రాగానే అన్ని అంశాలను పరిశీలిస్తారు. రాష్ట్రానికి వచ్చే నీటి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. బనకచర్ల పై కేంద్రానికి లేఖలు రాడయం వల్లే పర్యావరణ అనుమతి ఆగింది అని అన్నారు.







