TAMA ఆధ్వర్యంలో చిన్నారులకు Kids AI Knowledge & Thinking Competition
భవిష్యత్ తరాలు సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందాలని, సాంకేతికతలో, AI లో మంచి నైపుణ్యం సాధించాలని తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ఓ కొత్త కార్యక్రమాన్ని సంకల్పించింది. “Kids AI Knowledge & Thinking Competition” అన్న పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కృత్రిమ మేధస్సు (AI) పై అవగాహన పెంపొందించడానికి ఈ పోటీని ప్రత్యేకంగా నిర్వాహకులు రూపొందించారు. వచ్చేదంతా సాంకేతిక యుగమేనని, పిల్లల్ని చిన్నతం నుంచే సాంకేతికంగా పరిపుష్టం చేయాలని, కనీస అవగాహన అయినా కల్పించాలని అందరమూ భావిస్తుంటాం. ఈ నేపథ్యంలోనే పిల్లలకు మరింత అవగాహన కల్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
అయితే.. ఇందులో పాల్గొనాలంటే ఎలాంటి కోడింగ్ లేదా ల్యాప్టాప్ అవసరం లేదు! కేవలం మీ ఆలోచనా శక్తి, ఒక పెన్సిల్ ఉంటే సరిపోతుంది.అయితే.. ఈ పోటీలను రెండు విభాగాలుగా నిర్వహిస్తున్నారు.
జూనియర్ క్విజ్ (Junior Quiz): 9 నుండి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం.
సీనియర్ క్విజ్ (Senior Quiz): 14 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం.
కేవలం 45 నిమిషాల పాటు జరిగే ఈ విజ్ఞాన పోటీ ద్వారా పిల్లల్లో టెక్నాలజీపై సృజనాత్మకతను వెలికితీసేలా నిర్వాహకులు పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి విభాగంలోనూ ప్రతిభ కనబరిచిన వారికి ఆకర్షణీయమైన ట్రోఫీలతో పాటు విలువైన ట్రైనింగ్ కూపన్లు అందజేయనున్నారు. అయితే.. బహుమతులు అదే రోజు ప్రదానం చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
ఛాంపియన్ (Champion – మొదటి స్థానం): $500 ట్రైనింగ్ కూపన్
రన్నరప్ (Runner Up – రెండో స్థానం): $400 ట్రైనింగ్ కూపన్
మూడో స్థానం (Third Place): $300 ట్రైనింగ్ కూపన్
ఈ క్రింది అంశాలపైనే ప్రధానంగా పోటీ వుంటుంది..
AI ఎలా పనిచేస్తుంది (How AI Works)
నిజ జీవితంలో AI వినియోగం (AI in Real Life)
భద్రత & బాధ్యత (Safety & Responsibility)
లాజికల్ థింకింగ్ (Logical Thinking)
ప్రాంప్ట్ డిజైన్ & సృజనాత్మకత (Prompt Design & Creativity)







