దేశంలో తొలి ఏఐ పోలీసు స్టేషన్‌గా పంజాగుట్ట : సజ్జనర్
దేశంలోనే తొలి ఏఐ పోలీసు స్టేషన్ (AI Police Station)గా పంజాగుట్ట మారనుందని హైదరాబాద్ సీపీ సజ్జనర్ (CP Sajjanar) తెలిపారు. పంజాగుట్ట పీఎస్ (Panjagutta PS)ను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. డిసెంబర్లో డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) చేతుల మీదుగా ఏఐ ఠాణా ప్రారంభమవుతుందని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ సరికొత్త విధానం తెస్తున్నట్లు చెప్పారు. రిసెప్షన్ లో సేతు కియోస్క్ ఏర్పాటు, 10 భాషల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఏఐ ఆధారంగానే ఎఫఐఆర్ నమోదు, కేసు డైరీ, దర్యాప్తు నివేదికలు, ఛార్జ్‌షీట్ రూపకల్పన ఉంటాయన్నారు. పోలీసు సిబ్బందికి దీనిపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.







