TAGB సూపర్ సింగర్స్ కార్యక్రమం సక్సెస్.. ఉత్సాహంగా పాల్గొన్న సింగర్స్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (TAGB) ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ సింగర్స్ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. ప్రజల నుంచి విశేషమైన, అద్భుతమైన స్పందన లభించింది. ఈ సూపర్ సింగర్స్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరయ్యారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ, ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సూపర్ సింగర్స్ లో వారంతా కూడా మంచి మంచి పాటలు పాడారు. అలాగే శాస్త్రీయ కళా సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటిని కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పిల్లలు శాస్త్రీయ సంగీతంతో పాటు వివిధ రకాలైన పాటలను కూడా ఆలాపించారు. ఇక..ఇందులో న్యాయ నిర్ణేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఎలా పాడారు? ఎక్కడ లోపం జరిగిందో కూడా వివరించారు.

మరో వైపు తాము తలపెట్టిన సూపర్ సింగర్స్ కార్యక్రమం విజయవంతం అయ్యిందని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ ప్రకటించింది. TAGB ‘సూపర్ సింగర్స్’ (Super Singers) కార్యక్రమానికి లభించిన అద్భుతమైన స్పందన మరియు భారీ హాజరు మమ్మల్ని ఎంతో సంతోషపరిచాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న వారందరూ మన గొప్ప శాస్త్రీయ కళా సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటిని ప్రదర్శించడం చూసి మాకు ఎంతో ఆనందం కలిగింది. మీ సంగీత ప్రయాణాల్లో మీకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాము—దయచేసి ఇలాగే పాడుతూ, మన శాస్త్రీయ సంప్రదాయాలను సజీవంగా ఉంచండి! మీలో ప్రతి ఒక్కరూ మాకు గర్వకారణంగా నిలిచారు.న్యాయనిర్ణేతలు అందరికీ, అలాగే ‘సూపర్ సింగర్స్’ నిర్వహణ బృందానికి చెందిన శ్రీనివాస్ బాల, వల్లి అమరావది మరియు పద్మజ బాలలకు అభినందనలు’’ అని ప్రకటించారు.








