విశాఖ నగరంలో ఘనంగా ప్రారంభమైన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026
• నేవిగేటింగ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ థీమ్ తో సదస్సును ప్రారంభించిన భారత పరిశ్రమల సమాఖ్య
• సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
• సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్, మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి
• భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు గ్రంథి మల్లిఖార్జునరావు, కియా ఇండియా ఎండీ సీఈఓ గ్వాంగ్ లీ, సుచిత్రా ఎల్లా, సీఐఐ అధ్యక్షుడు, టాటా కెమికల్స్ సీఈఓ ఆర్ ముకుందన్ తదితరులు
• సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు తరలి వచ్చిన 58 దేశాలకు చెందిన ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు, భారత్ లో విదేశీ రాయబారులు
• ఇండియా ఏఐ మిషన్, రెన్యూవబుల్ ఎనర్జీ లాంటి కార్యక్రమాలతో భారత్ లో ఉత్పాదకత, టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతున్నాయన్న సీఐఐ అధ్యక్షుడు ఆర్ ముకుందన్
• ఎమర్జింగ్ టెక్నాలజీల్లో వివిధ దేశాల భాగస్వామ్యంతో పనిచేయాల్సి ఉందని స్పష్టం చేసిన భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు
• సోలార్ ప్యానళ్ల తయారీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, సెమీ కండక్టర్స, ఈవీల తయారీలో కీలకంగా మారాల్సి ఉందని స్పష్టం
• ఆహార భద్రత కోసం అగ్రి వ్యాల్యూ చైన్స్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఏర్పాటు కావాల్సి ఉందని వెల్లడి
• అప్పుడే వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు సాధ్యం అవుతాయని స్పష్టం చేసిన సీఐఐ







