ఏపీ పెవిలియన్ ప్రాంగణాన్ని ఆసక్తిగా పరిశీలించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
• ఏపీ పెవిలియన్‌లో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఏర్పాటు కళాకృతుల వద్ద ఫొటో దిగిన కేంద్ర మంత్రి పీయూష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.
• తిరుపతి, విశాఖపట్టణం, అమరావతి ఎకనమిక్ రీజియన్లల్లో చేస్తున్న అభివృద్ధిని వివరించిన అధికారులు.
• సీఆర్డీఏలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజెంట్ చేసిన అధికారులు.
• విశాఖ అభివృద్ధిపై డిజిటల్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు.
• అరకు కాఫీ స్టాల్ వద్ద కేంద్ర మంత్రి పీయూష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి అరకు కాఫీని రుచి చూసిన సీఎం చంద్రబాబు.
• ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించిన నేతలు.
• గిరిజనుల రూపొందిచిన చిత్రాలను ప్రత్యేకంగా తిలకించి… నమూనా చిత్రాలను తీర్చిదిద్దిన కేంద్ర మంత్రి, సీఎం.
• ఆంధ్రప్రదేశ్ కు చెందిన వివిధ కళలకు చెందిన ప్రముఖుల పేర్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించిన నేతలు.
• ఏయే కళాకారులు… ఏయే రంగాల్లో ప్రావీణ్యత సాధించారోననే అంశాన్ని కేంద్రమంత్రికి వివరించిన సీఎం చంద్రబాబు.
• తోలబొమ్మలాట, పెన్ కలంకారీ సహా వివిధ కళాకృతుల స్టాళ్లను సందర్శించిన నేతలు.
• వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల వివరాలను నేతలకు ప్రజెంట్ చేసిన అధికారులు.
• సదస్సు ప్రాగంణంలో కొద్దిసేపు బ్యాటరీ కారులో ప్రయాణించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.







