డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ
విశాఖపట్నం: విశాఖ (Visakha)లో జరుగుతున్న సిఐఐ 31వ పార్టనర్ షిప్ సమ్మిట్ (Partnership Summit) కు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఇన్వెస్టర్ల వివరాలను మంత్రి లోకేష్ డిప్యూటీ సిఎంకు తెలియజేశారు. పెట్టుబడుల రాకకు చొరవ చూపుతున్న మంత్రి లోకేష్ ను పవన్ కళ్యాణ్ అభినందించారు. భవిష్యత్తులో ఇదే ఒరవడిని కొనసాగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.







