ఏపీ పెవిలియన్, ఎంఎస్ఎంఈ ప్రదర్శనను వీక్షించిన మంత్రి లోకేష్
విశాఖపట్నం: సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ప్లీనరీ హాల్ లో ఏర్పాటుచేసిన ఏపీ పెవిలియన్, ఎంఎస్ఎంఈ ప్రదర్శనను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal), సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వీక్షించారు. ఈ సందర్భంగా ఏపీ సాంస్కృతిక, కళారంగ వైభవాన్ని చాటిచెప్పేలా ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను మంత్రి సందర్శించారు. అరకు కాఫీ రుచి చూశారు. రాజధాని అమరావతి టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుపతి, విశాఖపట్టణం, అమరావతి ఎకనామిక్ రీజియన్లలో చేస్తున్న అభివృద్ధిని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, రాజ్యసభ ఎంపీ భాష్యం ప్రవీణ్, మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.







