విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం.. హాజరైన కేంద్రమంత్రి పీయూష్ గోయల్
విశాఖపట్నంలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు (Chandrababu), కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) పాల్గొన్నారు. సదస్సు ప్రాంగణానికి వెళ్లే ముందు స్టాళ్లను సందర్శించి కళాకృతులను పరిశీలించారు.







