విశాఖలో ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు … సభకు చేరుకున్న సీఎం చంద్రబాబు
సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వివిధ కంపెనీల సీఈఓలు, సీఎండీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గారు, మంత్రి టీజీ భరత్ (TG Bharat) గారు సమావేశమయ్యారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అభినందనీయమని కంపెనీల సీఈఓలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో హీరో గ్రూప్ ( Hero Group), భారత్ బయోటెక్ ( Bharat Biotech), అపోలో, సన్ ఇంటర్ నేషనల్, రెన్యూ, రాక్ వెల్ ఆటోమేషన్, జీఎంఆర్ గ్రూప్ లకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.







