డీసీ మెట్రో సాయి సంస్థాన్ ఆధ్వర్వంలో మహా రుద్రాభిషేకం, ఏకాదశ రుద్ర సహసహ్ర లింగాభిషేక మహోత్సవం
డీసీ మెట్రో సాయి సంస్థాన్ ఆధ్వర్వంలో మహా రుద్రాభిషేకం, ఏకాదశ రుద్ర సహసహ్ర లింగాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. నవంబర్ 14 వ తేదీన ఉదయం 8:30 గటల నుంచి శ్రీ మహారుమహా రుద్రాభిషేకం, ఏకాదశ రుద్ర & సహస్ర లింగ అభిషేకం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర వేడుకలో రుద్ర హోమం, శంఖ అభిషేకం మరియు కలశ అభిషేకాలు కూడా కన్నుల పండువగా జరగనున్నాయి.
ఇందులో భాగంగా ఆ రోజు ఉదయం గణేశ పూజ, మహాన్యాసం ప్రారంభం అవుతాయి.
ఏకాదశ రుద్రం (11 సార్లు) పఠనంతో పాటు, 1,008 శివ లింగాలకు అభిషేకం నిర్వహిస్తారు.
భక్తిశ్రద్ధలతో రుద్ర హోమం మరియు 1,008 శివ లింగాలకు శంఖ అభిషేకం చేయబడుతుంది. శివలింగాలకు కలశ అభిషేకం, తదుపరి విశేష అలంకారం, మహా నైవేద్యం వుంటుంది.ఈ విశేష కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సంస్థానం పిలుపునిస్తోంది.
స్పాన్సర్షిప్ మరియు ఇతర వివరాల కోసం:
వెబ్సైట్: www.dcmetrosaisamsthan.org చిరునామా: 19711 Waters Road, Germantown, MD 20874
ఈమెయిల్: [email protected]
ఫోన్ నంబర్: 301-528-0724






