స్థానిక సంస్థల ఎన్నికల్లో … అభివృద్ధి, సంక్షేమానికే ఓటు వేశారు : మంత్రి ఆనం
అభివృద్ధి, సంక్షేమం చూసి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు కూటమికి పట్ట కట్టారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా (Nellore District)లో గతంతో పోలిస్తే దాదాపు 100 శాతానికి పైగా ఆధిక్యం పెరిగిందని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గం (Atmakur Constituency) లోని ఆరు మండలాలు, మున్సిపల్ చైర్పర్సన్ (Municipal Chairperson) అన్నీ కలిపి దాదాపు 18,174 ఓట్ల మెజార్టీ వచ్చిందని తెలిపారు.







