అగ్ని ప్రమాదాలపై హోం మంత్రి అనిత ఆరా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన అగ్నిప్రమాదాలపై హోం మంత్రి అనిత (Anita) ఆరా తీశారు. విజయనగరం జిల్లా రాజాంలో ఆటోమొబైల్ షోరూమ్ (Automobile Showroom) అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. దీపావళి టపాసుల నిప్వురవ్వలతో షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో బాణసంచా నిప్పుల వల్ల ఫర్నిచర్ దుకాణం (Furniture store)లో అగ్నిప్రమాదం జరిగింది. తిరువూరు (Tiruvuru)లో షార్ట్ సర్క్యూట్‌తో మరో దుకాణం దగ్ధమైంది. మూడు అగ్నిప్రమాదాల వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.







