ప్రపంచ తెలుగు మహాసభలు.. గోవా గవర్నర్‌కు ఆహ్వానం
ఒంగోలు నగరంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో జరిగే బాలల ప్రపంచ తెలుగు మహాసభల ( World Telugu Conference Children)కు గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు (Pusapati Ashok Gajapathi Raju)ను ఆహ్వానించినట్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ (Ghazal Srinivas) తెలిపారు. గోవాలోని లోక్ భవన్ లో గవర్నర్‌ను కలిసి ఆహ్వానం పత్రం అందజేశామన్నారు. సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఒంగోలు నెక్ట్స్‌జెన్ స్కూలు ఆవరణలో ఈ మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు. 19న కార్యక్రమానికి హాజరై సభను ప్రారంభించాలని కోరగా ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సంస్థ ఉపాధ్యక్షుడు పి.రామచంద్రరాజు (Ramachandra Raju) ఉన్నారు.







