ధర్మన్ తో రామ్ పోతినేని కోలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ!
సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ సినిమా ధర్మన్(Dharman) రోజురోజుకూ ఆసక్తిని పెంచుకుంటోంది. తాజాగా ఈ ప్రాజెక్టులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram pothineni) భాగం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాతో రామ్ కోలీవుడ్ లోకి అడుగుపెడుతుండటం విశేషం. మొదటిసారిగా రజినీకాంత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో ఆయన ఫ్యాన్స్ లోనూ స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది. తాజాగా రిలీజైన రామ్ క్యారెక్టర్ కు సంబంధించిన వీడియో సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది.
ఈ సినిమాలో రామ్ పోషిస్తున్న పాత్రకు కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ పాత్రకు ధీటుగా ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్(Anirudh ravichander) అందించిన స్పెషల్ మ్యూజిక్ బిట్ రామ్ క్యారెక్టర్ ను మరింత ఎలివేట్ చేస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై చూడబోతుండటం ఆడియన్స్‌కు థియేటర్లలో సరికొత్త అనుభూతిని అందించనుంది.
కమల్ హాసన్(Kamal hasan), ఆర్. మహేంద్రన్(R. Mahendran) నిర్మిస్తున్న ఈ సినిమాకి అశ్వత్ మారిముత్తు(Aswath Marimuthu) దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా(Raashi khanna), శ్రీలీల(Sree Leela), సిమ్రన్(Simran), నయనతార(Nayanthara) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ప్రాజెక్టు భారీ టెక్నికల్ టీమ్ తో రూపుదిద్దుకుంటోంది. రజినీకాంత్‌కు రామ్ పోతినేని తోడవడంతో ధర్మన్ పై ఆడియన్స్ లో అంచనాలు మరింత పెరిగాయి.







