సహకార సంఘాల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు
ఆంధ్రప్రదేశ్లో సహకార సంఘాల ఎన్నికలు ( Cooperative Society Elections ) నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఒకేవిడతలో ఎన్నికలు (Elections) నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నోటిఫికేషన్ (Notification) కోసం చూడకుండా క్షేత్రస్థాయిలో సన్నాహాలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఈ చర్యల నివేదికను పది రోజుల్లోగా సమమర్పించాలని పేర్కొంది. జనవరి (January)లో ఉమ్మడి జిల్లాల వారీగా సహకార ఎన్నికలు జరిపే అవకాశముంది.







