జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల పై ఎస్ ఈసీ ప్రకటన
జడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ ( MPTC) ఎన్నికల తుది ఫలితాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా జరిగిన ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) 406, వైసీపీ 76, జనసేన 73, భారతీయ జనతా పార్టీ 20, స్వతంత్రులు, 6 సీపీఐ(ఎం) ఒక స్థానంలో విజయం సాధించాయి. 7,768 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా, తెలుగుదేశం 4,806 వైసీపీ (YSRCP) 1,711, జనసేన 938, బీజేపీ 117, స్వతంత్రులు 169, కాంగ్రెస్ 9, సీపీఐ(ఎం) 15, బీఎస్పీ 3 స్థానాల్లో గెలుపొందాయి.







