పండుగ వేళ .. రాష్ట్రంలో అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా
దీపావళి (Diwali) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న వేర్వేరు అగ్ని ప్రమాదాల (Fire Accidents) పై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఆరా తీశారు. రాజాం, గన్నవరం, తిరువూరుల్లో జరిగిన అగ్ని ప్రమాదాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాలపై హోం మంత్రి అనిత (Anitha) కూడా ఆరా తీశారు.







