ఉత్కంఠ రేపుతున్న ‘RX’ ఫస్ట్ లుక్
విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj), ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers)తో కలిసి ఓ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మిస్తున్నారు. RX అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నాజర్(Nassar), రమేష్ తిలక్(ramesh tilak), శ్రీజ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ వెంకట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో పాటు స్ట్రాంగ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా రూపొందుతోంది.
దీపావళి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. రద్దీగా ఉన్న రైలు కంపార్ట్మెంట్లో ఎల్లో కలర్ శారీ, ప్రింటెడ్ బ్లౌజ్ ధరించి కనిపిస్తున్న రెజీనా లుక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆమె ముఖంలోని గంభీరత, చుట్టూ కనిపిస్తున్న రైలు ప్రయాణ వాతావరణం సినిమాలోని ఉత్కంఠభరితమైన కథకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
ట్రూత్ ఆల్వేస్ డిమాండ్స్ ఏ వాయిస్! అనే ట్యాగ్‌లైన్ కథలోని ప్రధాన సంఘర్షణపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌పై కనిపిస్తున్న ఈసీజీ తరహా గ్రాఫిక్స్ మరింత మిస్టరీని జోడిస్తున్నాయి. హెషమ్ అబ్దుల్ వహాబ్(Hesham abdhul wahab) ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు.







