నెల్లూరు రూరల్లో కూటమి ఘన విజయం : కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ఘన విజయం సాధించిందని ఎమ్మెల్మే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధితోనే అపూర్వ విజయం సాధించామని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్లో కార్పొరేషన్ (Corporation), జడ్పీటీసీ ( ZPTC) , ఎంపీటీసీ ( MPTC) ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని వివరించారు. రూరల్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని పేర్కొన్నారు. విజయాన్ని చూసి పొంగిపోకుండా అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. 2029 ఎన్నికల్లో కూటమి పార్టీలు నూటికి నూరు శాతం విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు.







