విరాళాల కోసం ట్యాక్స్ ఐడీ వివరాలను ప్రకటించిన శంకర నేత్రాలయ యూఎస్ఏ
‘శంకర నేత్రాలయ యూఎస్ఏ’ (Sankara Nethralaya USA) సంస్థ ద్వారా నిధుల సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ట్యాక్స్ ఐడీ (TAX ID: 52-1611548) వివరాలను నిర్వాహకులు తాజాగా వెల్లడించారు. మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) – హాస్పిటల్ ఆన్ వీల్స్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి శంకర నేత్రాలయ యూఎస్ఏ (SNUSA) ఉదార స్వభావం గల వ్యక్తులను, కుటుంబాలను మరియు సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
MESU ద్వారా, శంకర నేత్రాలయం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అంతగా అందుబాటులో లేని వారికి అత్యవసర కంటి సంరక్షణ సేవలను మరియు దృష్టిని తిరిగి తెచ్చే శస్త్రచికిత్సలను అందిస్తోంది.
కంటి శస్త్రచికిత్సలు: ఒక సింగిల్ కంటిశుక్లం (Cataract) శస్త్రచికిత్సకు $65, ఒక సింగిల్ మేజర్ సర్జరీకి $250 విరాళంగా అందించవచ్చు. అలాగే 100 కంటిశుక్లం శస్త్రచికిత్సలకు $6,500 మరియు సింగిల్ డేలో 40 ఉచిత సర్జరీల కోసం $2,600 విరాళం అందజేయవచ్చు.
మొబైల్ మరియు స్క్రీనింగ్ క్యాంపులు: ఒక రోజు మొబైల్ రూరల్ టెలిఆప్తాల్మాలజీ క్యాంపునకు $290, రూరల్ స్కూల్ స్క్రీనింగ్ క్యాంపునకు $300 విరాళంగా నిర్ణయించారు.
MESU అడాప్ట్-ఎ-విలేజ్ ఐ క్యాంపు (హాస్పిటల్ ఆన్ వీల్స్): చెన్నై, జార్ఖండ్, హైదరాబాద్, పుట్టపర్తి, ఎట్టయపురం పరిసర ప్రాంతాలలో 300 కి.మీ రేడియస్ లోపు నిర్వహించడానికి $12,500 మరియు 500 కి.మీ రేడియస్ లోపు నిర్వహించడానికి $15,000 విరాళం అందించవచ్చు.
చెన్నై / కోల్కతాలో ఆప్టోమెట్రీ రూమ్ నామింగ్ కోసం రూ. 10 లక్షలు.
కన్సల్టెంట్ రూమ్ నామింగ్ కోసం రూ. 15 లక్షలు.
చెన్నైలో రిఫ్రాక్టివ్ సర్జరీ సూట్ నామింగ్ కోసం రూ. 1 కోరు.
H.T. parekh మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్ (1 OT) కోసం రూ. 1.5 కోట్లు.
లో విజన్ కేర్ క్లినిక్ & స్పెషల్ చిల్డ్రన్ విజన్ కేర్ క్లినిక్ డిపార్ట్మెంట్ నామింగ్ కోసం రూ. 1.5 కోట్లు.
ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ నామింగ్ కోసం రూ. 2 కోట్లు.
MESU – మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ నామింగ్ కోసం రూ. 4 కోట్లు విరాళంగా సమర్పించవచ్చు.
దాతలు తమ పన్ను మినహాయింపు (Tax-Deductible) చెక్కులను SN USA, 7238 Muncaster Mill Rd, No 522, Derwood, MD 20855 అనే చిరునామాకు పంపాలని కోరారు. అలాగే ఆన్లైన్ ద్వారా విరాళాలు అందించాలనుకునే వారు www.sankaranethralayausa.org వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు.







