సంక్రాంతి బరిలోకి శ్రీవిష్ణు ఫ్యామిలీ ప్యాక్
విభిన్న కథాంశాలతో ఆడియన్స్ ను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు(Sree vishnu) మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకుని కొత్త సినిమాతో రెడీ అవుతున్నారు. సామజవరగమన(Samajavaragamana) వంటి బ్లాక్‌బస్టర్‌తో ఆడియన్స్ ను మెప్పించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు(Ram abbaraju)తో ఆయన మరోసారి జతకట్టారు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తున్న ఈ సినిమాకి ఫ్యామిలీ ప్యాక్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీపావళి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. చేతిలో తుపాకీ, చుట్టూ గాలిలో ఎగురుతున్న కరెన్సీ నోట్లు, పక్కనే లగేజీ ట్రాలీతో శ్రీవిష్ణు కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఆయన ఎక్స్ప్రెషన్స్, పోస్టర్‌లోని విభిన్న అంశాలు సినిమాలో ఏదో ఇంట్రెస్టింగ్ సంఘటనల సమాహారం ఉండబోతుందనే సంకేతాలిస్తున్నాయి. డబ్బు, ప్రయాణం, అనూహ్య పరిణామాల నేపథ్యంలో వినోదం పంచే కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.
టెక్నికల్ గా మంచి క్వాలిటీతో రూపొందుతున్న ఈ సినిమాకు టాలెంటెడ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్, రామ్ అబ్బరాజు వినోదాత్మక కథన శైలి మరోసారి కలిస్తే థియేటర్లలో నవ్వుల సందడి ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటూ యూత్ ను కూడా ఆకట్టుకునేలా రూపొందుతున్న ఫ్యామిలీ ప్యాక్ సంక్రాంతి బరిలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.







