కీర్తి సురేష్ గోల్డెన్ గ్లామ్ లుక్.. స్టైలిష్ పోజులతో మెస్మరైజ్!
తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy suresh) మరోసారి తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో రూపొందించిన స్పెషల్ ఫ్యాషన్ అవుట్‌ఫిట్‌లో ఆమె మెరిసిపోతుంది. బ్లాక్ శాటిన్ టాప్, గోల్డెన్ ఎంబ్రాయిడరీతో కూడిన స్కర్ట్, దానికి జోడించిన గోల్డ్ టెక్స్చర్డ్ బ్లేజర్ ఆమె లుక్కు స్పెషల ఎట్రాక్షన గా నిలిచాయి. చిన్న సన్ గ్లాసెస్, గోల్డ్ జ్యువెలరీ, స్టైలిష్ హ్యాండ్‌బ్యాగ్‌తో కీర్తి తన ఫ్యాషన్ సెన్స్‌ను మరోసారి చాటుకుంది. ముఖ్యంగా ఆమె ధరించిన గోల్డ్ యాక్సెసరీస్, బ్లాక్ అవుట్‌ఫిట్‌కు అద్భుతమైన కాంబినేషన్‌గా నిలిచాయి. ప్రతి పోజులోనూ కాన్ఫిడెన్స్, ఎలిగెన్స్ కలగలిసిన ఆమె స్టైల్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. సింపుల్‌గా కనిపిస్తూనే రాయల్ లుక్‌తో మెస్మరైజ్ చేయడం కీర్తి సురేష్ స్పెషాలిటీ. ట్రెడిషనల్, మోడ్రన్ స్టైల్స్‌లో తనదైన ముద్ర వేస్తున్న ఈ అందాల భామ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.







