వైసీపీ యూఎస్ఏ విభాగం కన్వీనర్ గా శివ మేక
వైఎస్సార్సీపీ అత్యంత కీలక ప్రకటనను విడుదల చేసింది. వైసీపీ అమెరికా (USA) కన్వీనర్ గా శివ మేకను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఓ అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. పార్టీకి సంబంధించి ప్రవాసాంధ్ర నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేసేందుకు, శివ మేకలో వున్న అనుభవాన్ని, నాయకత్వ లక్షణాలను పరిగణనలోకి తీసుకున్న వైసీపీ అధిష్ఠానం.. ఆయన పేరును ఖరారు చేసింది.
అమెరికాలోని ఎన్నారై (NRI) నెట్వర్క్ను బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడం మరియు వైఎస్సార్సీపీ మద్దతుదారులను ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. తనకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించినందుకు శివ మేక వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ధన్యవాదాలు ప్రకటించారు. వైసీపీ విస్తరణకు విశేషంగా కృషి చేస్తానని ప్రకటించారు.
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన శివారెడ్డి మేక ప్రస్తుతం న్యూజెర్సీలోని ప్రిన్స్టన్లో నివసిస్తున్నారు. ఆయన టెక్నాలజీ, మీడియా, మరియు రియల్ ఎస్టేట్ రంగాలలో వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు.







