హైడ్రా కమిషనర్‌ను హాజరుపర్చండి : హైకోర్టు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath)ను న్యాయస్థానంలో హాజరుపర్చాలని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand)ను హైకోర్టు (High Court) ఆదేశించింది. కోర్టు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాకపోవడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్‌ను వచ్చే మంగళవారం కోర్టులో హాజరుపర్చాలని ఆదేశాల్లో పేర్కొంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న రంగనాథ్, శంషాబాద్ తహసీల్దార్ (Shamshabad Tahsildar) పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.







