ఏపీ లో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న కార్పొరేషన్లు (Corporations), మున్సిపాలిటీలు (Municipalities), నగర పంచాయతీలకు ఈ నెల 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. పెండింగ్ కోర్టు కేసుల ( Court Cases) పరిష్కారంతో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కలిపి మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల్లో రెండోదశ ఎన్నికలకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఏర్పాట్లు చేసింది.







